న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? తేడా వస్తే తాట తీస్తారు

Updated on: Dec 18, 2025 | 5:42 PM

హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, ఆంక్షలు విధించారు. క్లబ్‌లు, బార్‌లలో అర్థరాత్రి 1 గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి. డ్రగ్స్, గంజాయి, బాణసంచా పూర్తిగా నిషేధించబడ్డాయి. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో డీజేలు రాత్రి 10 గంటల వరకు మాత్రమే. మైనర్‌లకు ప్రవేశం లేదు. సురక్షిత వేడుకలకు సహకరించాలి.

హైదరాబాద్​ నగరం న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతోంది. ఈసారి మరింత వినూత్నంగా కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు నగరవాసులు ఎదురుచూస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. స్టార్​ హోటల్స్‌, క్లబ్​స్‌, బార్​లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడంతోపాటు.. పలు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్‌ గైడ్‌ లైన్స్‌ జారీ చేశారు. స్టార్​ హోటల్స్‌, క్లబ్స్, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్, పబ్‌ల నిర్వాహకులు 15 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవడంతో పాటు.. అర్ధరాత్రి ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్‌ చేసుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణ, అశ్లీలత లేని ప్రదర్శనలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. సెలబ్రేషన్స్‌ ప్రాంతంలో ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు హైదరాబాద్‌ పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలని రాజేంద్రనగర్‌ డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. ఇండోర్‌లో మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ సౌండ్‌ మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. పార్టీల్లో బాణసంచాకు అనుమతి లేదని.. వెహికల్ పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు హైదరాబాద్‌ పోలీసులు. సెలబ్రేషన్స్‌లో భాగంగా.. కెపాసిటీకి మించి పాస్‌లు, టికెట్లు, కూపన్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రధానంగా.. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడొద్దన్నారు . ఇలాంటివి ఎవరైనా వాడుతున్నట్లు తెలిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్‌, గంజాయి, లిక్కర్‌తో పాటు అనేక అంశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మైనర్‌లకు ప్రవేశం నిషేధంతో పాటు డ్రగ్స్‌ వాడకంపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

Ravi Teja: కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ.. వరుస ఫ్లాపుల తర్వాత ఇప్పుడు బోధపడిందా

ఒక్క పాటతో మారిపోతున్న సినిమాల జాతకాలు..

Demon Pavan: అప్పుడు ఇజ్జత్‌ పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు హీరోలా నిలబడ్డాడు

Bharani: గెలవకున్నా పర్లేదు.. ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ దక్కించున్న భరణి