PM Modi: సర్ధార్‌ పటేల్‌కు నివాళిగా హైదరాబాద్‌ లిబరేషన్‌ డే నిర్వహిస్తున్నాం: ప్రధాని మోదీ

Updated on: Sep 17, 2025 | 4:20 PM

మధ్యప్రదేశ్‌ ధార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావించారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేసిన ఘనత సర్దార్‌ పటేల్‌కే దక్కుతుందని మోదీ పేర్కొన్నారు.. అందుకే పటేల్‌కు నివాళిగా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ లిబరేషన్‌ డేను ఘనంగా నిర్వహిస్తునట్టు వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ జన్మదినాన్ని మధ్యప్రదేశ్‌ లోని ధార్‌లో జరుపుకున్నారు. ధార్‌లో “స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌” పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఆదివాసీ మహిళల ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా 75వేల హెల్త్‌క్యాంపుల ఏర్పాటు చేసినట్టు మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ ధార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావించారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ను విముక్తి చేసిన ఘనత సర్దార్‌ పటేల్‌కే దక్కుతుందని మోదీ పేర్కొన్నారు.. అందుకే పటేల్‌కు నివాళిగా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ లిబరేషన్‌ డేను ఘనంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

బీజేపీకి ఇది గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని సర్ధార్‌ పటేల్‌ విలీనం చేశారు.. సర్ధార్‌ పటేల్‌ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతారంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం

Published on: Sep 17, 2025 02:43 PM