దగ్గరలో ఉన్న ఆస్పత్రి వదిలేసి..అంత దూరం ఎందుకు తీసుకెళ్లారు?వీడియో
ఓ బైకు.. ఓ బీఎం డబ్ల్యు కారు.. బైకును ఢీకొట్టిన కారు.. ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు.. నిమిషాల దూరంలో పలు ఆస్పత్రులు ఉన్నా.. క్షతగాత్రులను 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది.. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి మృతి. అవును.. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు.. వారి మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా విధుల నిర్వహిస్తున్న నవ్‌జోత్ ఆయన భార్య కలిసి ఆదివారం ఓ గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి వచ్చిన బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నవజోత్ సింగ్ ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయని, వారే బాధితులను ఆసుపత్రిలో చేర్పించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ్‌జోత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కుటుంబం, నవ్‌జోత్ సహచరులు విషాదంలో మునిగిపోయారు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో
నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో
జపాన్‌లో లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
