Cyber Crime: సెలబ్రిటీల చెవుల్లోనూ సైబర్ ఫ్లవర్స్.. ఉపేంద్ర ఫోన్ ఎలా హ్యాక్ చేశారంటే?
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. సామాన్యులనే కాదు.. సినీ తారలను సైతం వదలట్లేదు. తాజాగా కన్నడ నటుడు ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంకల ఫోన్లు హ్యాక్ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్పామర్లు నమ్మదగిన విధంగా మాట్లాడి, డెలివరీ మిస్ అయిందని చెప్పి ప్రియాంక ఫోన్ ను హ్యాక్ చేసి, ఆ తరువాత ఉపేంద్ర ఫోన్ కూడా హ్యాక్ చేశారు. ఇలా సెలబ్రిటీలు కూడా సైబర్ నేరస్థుల బారిన పడుతున్నారని ఈ ఘటన వెల్లడిస్తుంది.
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. సామాన్యులనే కాదు.. సినీ తారలను సైతం వదలట్లేదు. తాజాగా కన్నడ నటుడు ఉపేంద్ర, ఆయన సతీమణి ప్రియాంక ఫోన్లను సైతం సైబర్ నేరస్థుల హ్యాక్ చేశారు. ప్రియాంకకు వచ్చిన కాల్‌లో, ఆమె ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ మిస్ అయిందని, డెలివరీ కోసం కొన్ని బటన్స్ నొక్కమని చెప్పారు. ప్రియాంక దీనికి ప్రతిస్పందించడంతో ఆమె ఫోన్ హ్యాక్ అయింది. తరువాత, ఉపేంద్ర ఫోన్ కూడా హ్యాక్ అయింది. స్పామర్లు ఉపేంద్ర పరిచయస్తులకు డబ్బులు పంపమని మెసేజ్‌లు పంపారు. ఈ ఘటనలో మంచు లక్ష్మీ, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా ఇలాంటి సైబర్ దాడుల బారిన పడ్డారని తెలుస్తోంది. సెలబ్రిటీలు కూడా సైబర్ నేరాలకు గురవుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

