Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. ప్రత్యక్ష ప్రసారం

Updated on: Sep 06, 2025 | 12:08 PM

భాగ్యనగర గణేష్ శోభాయాత్ర.. ఇది ఏడు దశాబ్దాల చరిత్ర. సాగరమంత జనం మధ్య జరిగే మహా నిమజ్జనం. టన్నుల కొద్దీ జోష్.. అందుకే ఇది మస్త్ ఫేమస్. హైదరాబాద్ గణేషుడంటేనే వరల్డ్ ఫేమస్‌ గణేశుడు. బాలాపూర్ లడ్డూ వేలం ఎంతకు పోయిందన్న

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ బండ్ అంతా వేలాది వినాయకులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్రజలు అందరూ ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర, నిమజ్జనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఇప్పుడు బడా వినాయకుని శోభయాత్ర ప్రారంభమైంది. ఈ గణేష్‌ శోభయాత్ర ప్రత్యక్ష ప్రసారం చూడండి.

భారీ భద్రత మధ్య హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్​ బండ్​ పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున నుంచే విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది. వాహనాలు, ప్రజల రద్దీ మధ్య ట్యాంక్​ బండ్​ కిక్కిరిసిపోతోంది. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్​ బండ సహా నగరంలోని ఇతర కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్​లో పరిధిలో ఇప్పటి వరకు సుమారు లక్షా 50 వేల గణేశ్​ విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు తెలుస్తోంది.

Published on: Sep 06, 2025 07:23 AM