గజగజా వణుకుతున్న ఉత్తర తెలంగాణ.. ఐఎండీ హెచ్చరిక

Updated on: Dec 31, 2025 | 10:10 PM

తెలంగాణలో గత మూడు వారాలుగా తీవ్ర చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ సహా పలు ఉత్తర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత తగ్గుతుందని, సంక్రాంతి తర్వాత వాతావరణంలో మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. గడిచిన 3 వారాలుగా తీవ్రమైన చలిగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం… బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ అంచనా ప్రకారం…. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి ప్రబలంగా ఉన్న తక్కువ స్థాయి గాలులు రాష్ట్రవ్యాప్తంగా శీతలగాలుల పరిస్థితులకు దోహదం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండే సూచనలున్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా చలి తీవ్రత ఊహించని స్థాయిలో ఉంటోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గడిచిన 3 వారాలుగా ఉన్న పరిస్థితులతో పోల్చితే… క్రమంగా చలి తీవ్రత తగ్గుతోందని పేర్కొంది. ఇక సంక్రాంతి తర్వాత… వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్‌

దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి

బంగారం కోసం ఇంటి ఓనర్‏ను చంపి గోదావరిలో పడేసిన యువకులు

30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు