Andhra: తెల్లారేసరికి లిక్కర్ షాప్ దగ్గరకు వచ్చిన యజమాని.. షట్టర్ ఓపెన్ చేద్దామని చూడగా
ఉదయాన్నే మందు షాప్‌నకు వచ్చిన యజమానికి షాక్ తగిలింది. ఎదురుగా కనిపించింది చూడగా అయ్యయ్యో.! అంటూ ఠక్కున పోలీస్ స్టేషన్‌కు పరుగు పెట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.
చలివేంద్రాలు ప్రజల దాహాన్ని తీరుస్తుంటే.. వైన్స్ మందుబాబుల దాహాన్ని తీరుస్తాయి. అలాంటి వైన్స్‌కే రక్షణ కరువైంది మావ.. అందుబాటులో మందు షాపులు ఉంటే చాలు.. అవే మాకు బ్యాంకుల్లా పనికొస్తాయ్ అంటున్నారు దొంగలు.. దొరికినకాడికి దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గాంధీనగర్ ఎస్‌విఎల్ మద్యం షాప్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం షాప్ షట్టర్ పగలగొట్టి లోపలికి చొరబడి దొంగతనం చేశారు. దొరికినకాడికి దొరికినంత నగదు, మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఈ ఘటనపై మద్యం షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

