భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చేటూచేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలిన భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చేటూచేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలిన భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే మంటలను ఫైర్ ఇంజన్ వాళ్ళు చాలా శ్రమకోర్చి అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం అయితే సంభవించలేదని చెప్పారు పోలీసులు. ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యుండొచ్చు అని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షల మేర నష్టం వాటి ఉండొచ్చు అని యజమాని సింగ్ అంటున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..