ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!
అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టాహెల్ప్’లో పనిచేస్తున్న సుశీల దీదీ రూపొందించిన క్రియేటివ్ రెజ్యూమె సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటి పనులను కార్పొరేట్ శైలిలో ప్రెజెంట్ చేస్తూ ‘సాఫ్-ఏఐ’ ఏజెంట్‌గా తనను పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తన అనుభవం, 5 స్టార్ రేటింగ్స్, సాధించిన ఫలితాలను వినూత్నంగా చూపించిన ఈ రెజ్యూమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉద్యోగం కోసం రెజ్యూమెను ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలో.. పెద్ద పెద్ద ఐటీ ఉద్యోగులు కూడా ఈ ‘సుశీల దీదీ’ని చూసి నేర్చుకోవాల్సిందే! అర్బన్ కంపెనీకి చెందిన ‘ఇన్‌స్టాహెల్ప్’ సర్వీస్‌లో పనిచేసే సుశీల దీదీ అనే పనిమనిషి తయారు చేసిన ఒక క్రియేటివ్ రెజ్యూమె ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో దీనిని షేర్ చేయడంతో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం వంటి పనులనే.. ఈ రెజ్యూమెలో ఎంతో తెలివిగా, హాస్యాన్ని జోడిస్తూ ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ స్టైల్‌లో ప్రెజెంట్ చేసిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందులో ఆమె.. నేను మీ ‘సాఫ్ ఏఐ’ఏజెంట్‌ను! “మీ జీవితాన్ని సులభతరం చేసే ‘సాఫ్ ఏఐ’ ఏజెంట్‌ను నేనే” అంటూ ఈ రెజ్యూమె చాలా కాన్ఫిడెంట్‌గా ప్రారంభమవుతుంది. తన సర్వీసులను కార్పొరేట్ స్టైల్‌లో ‘3Cs’ క్లీన్ ఫ్లోర్స్, క్లీన్ యుటెన్సిల్స్, క్లీన్ క్లోత్స్ అంటూ చాలా స్పష్టంగా వివరించారు. ‘సఫాయ్’ అంటే హిందీలో శుభ్రం చేయడం..అని అర్థం. safai అనే పదాన్ని ఆమె విడదీసి సాఫ్-ఏఐ ని అని ఎంతో తెలివిగా వివరించారు. కేవలం పనుల జాబితా మాత్రమే కాకుండా తను సాధించిన ఫలితాలను నంబర్లతో సహా అందులో తెలియజేయడం విశేషం. ‘ఈ రోజు నేను పనికి రాను అని యజమానులు పడే టెన్షన్‌ను 1,250కి పైగా ఇళ్లలో విజయవంతంగా తగ్గించాను’ అని రాసుకొచ్చింది. అలాగే ‘పార్టీల తర్వాత ఇల్లు సర్దలేక ఇబ్బంది పడే 500 మందికి పైగా బ్యాచిలర్లను నైట్‌మేర్స్ నుండి కాపాడాను’ అంటూ క్రేజీ పాయింట్లను జోడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ ఎవరి వద్దా ‘పని బాగా చేయలేదు’ అనే మాట వినలేదని, 2,978 కంటే ఎక్కువ ‘5స్టార్’ రేటింగ్‌లు సాధించి అందరి ‘ఫేవరెట్ దీదీ’గా రికార్డు సృష్టించానని ఆమె తన అచీవ్‌మెంట్స్ సెక్షన్‌లో గర్వంగా రాసుకున్నారు. ఈ వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీ వెనుక అర్బన్ కంపెనీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులతో పాటు ఈ రెజ్యూమె ప్రింట్లను కూడా కస్టమర్లకు పంపిణీ చేశారు. ఉద్యోగం ఏదైనా సరే.. మనల్ని మనం ఎలా బ్రాండ్ చేసుకోవాలో, మన నైపుణ్యాలను ఎంత ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేయాలో చెప్పడానికి ఈ వైరల్ సీవీ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కెరీర్ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు
ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!

