అరుదైన శివలింగం..చూస్తే జన్మ ధన్యం..వీడియో
సాధారణంగా పరమేశ్వరుని లింగరూపంలో పూజిస్తారు. ఈ లింగాల్లో చాలా రకాలు ఉంటాయి. అగ్ని లింగం, వాయులింగం, జల లింగం ఇలా రకరకాల నామాలతో శివున్ని ఆరాధిస్తారు. మరి అభయహస్తం ఉన్న శివలింగాన్ని ఎప్పుడైనా చూశారా? మీరు విన్నది నిజమే.. ఇది పూజలో భాగంగా అలంకరించిన అభయహస్తం కాదు.. స్వయంగా పరమేశ్వరుడు అభయహస్తంతో విరాజిల్లుతున్నాడు ప్రకాశం జిల్లాలోని పర్వతవర్ధినీ సమేత వృశ్చికాల మల్లికార్జునస్వామి ఆలయంలో. ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని మల్లికార్జునస్వామి శివాలయంలో శివ లింగం దక్షిణ హస్తాన్ని కలిగి ఉంటుంది. అదే ఇక్కడి విశిష్టత. అంతేకాదు, ఈ ఆలయంలో రెండు తలల గండ భేరుండ పక్షి శిల్పం కూడా దర్శనమిస్తుంది. పర్వతవర్ధినీసమేత వృశ్చికాల మల్లికార్జునస్వామి ఆలయం ఆలయంలో అభయ హస్త లింగం, రెండు తలల గండబేరుండ పక్షి శిల్పాలుగా ఈ ఆలయంలోని రాతి స్తంభంపై చెక్కబడి ఉన్నాయి. ఇవి కేవలం శ్రీశైలం ఆలయ ప్రాకారాలపై మాత్రమే కనిపించే అరుదైన శిల్పాలు. ఈ ఆలయంలో పూజలు చేస్తే శివుడు అభయహస్తంతో ఆశీర్వదివిస్తాడని భక్తులు నమ్ముతారు. మరో వైపు రెండు తలలున్న అరుదైన గండబేరుండ పక్షి శిల్పం కూడా ఆలయ ఉత్తర ద్వారంపైన కనిపిస్తుంది. ఆలయానికి పక్కనే ఉన్న వృద్ద మల్లికార్జునస్వామి ఆలయం శ్రీశైలంలోనూ, త్రిపురాంతకంలోనూ ఈ గండభేరుండ పక్షి శిల్పాలు ఉండటంతో ఈ ఆలయం కూడా చారిత్రక ప్రాశస్థ్యం ఉన్న త్రిపురాంతకం ఆలయంతో పాటు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :