ఇకపై శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!

|

Sep 14, 2024 | 1:09 PM

శాటిలైట్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు దిశగా మరో ముందడుగు పడింది. ఎప్పటి నుంచో ఈ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటిస్తూ వస్తున్న కేంద్ర రవాణా శాఖ.. తాజాగా దీన్ని నోటిఫై చేసింది. ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్తగా గ్లోబల్‌ నావిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌ (GNSS) ఆధారిత టోల్‌ విధానం అమల్లోకి రానుంది.

శాటిలైట్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు దిశగా మరో ముందడుగు పడింది. ఎప్పటి నుంచో ఈ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటిస్తూ వస్తున్న కేంద్ర రవాణా శాఖ.. తాజాగా దీన్ని నోటిఫై చేసింది. ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం.. టోల్‌ ప్లాజాల వద్ద కొత్తగా గ్లోబల్‌ నావిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌ (GNSS) ఆధారిత టోల్‌ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఫాస్టాగ్‌, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్ రికగ్నిషన్‌ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం అమలు కానుంది. నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌తో కూడిన ఆన్‌ బోర్డు యూనిట్‌ కలిగిన వాహనాలు టోల్‌ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు.. ప్రయాణించిన దూరానికి గానూ టోల్‌ ఫీజు ఆటోమేటిక్‌గా చెల్లింపు జరిగిపోతుంది. ఈ తరహా వాహనాలకు ప్రత్యేక లేన్‌లను అమర్చనున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా ??

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. సోషల్‌ మీడియా బ్యాన్‌.. ఎందుకో తెలుసా ??

ఏకాకిగా ఏక శిలా మహాగణపతి.. నిలువ నీడలేకుండా..

దుబాయ్‌ యువరాణి సంచలన పోస్ట్‌.. ఈ డైవర్స్‌ వెరీ స్పెషల్‌ అంటూ..