PM Modi: ఓవైపు అభివృద్ధి పనులు, మరోవైపు సాహసాలు.. ప్రధాని లక్షద్వీప్‌ టూర్ హైలెట్స్

|

Jan 04, 2024 | 6:07 PM

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు లక్షద్వీప్ లో పర్యటించారు. సూర్యుడు ఉదయించకముందే బీచ్ కు వచ్చిన మోదీ అక్కడ నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. లక్షద్వీప్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడి ప్రజలు అందించిన ఆతిథ్యం అద్భుతమని ఆయన కొనియాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు. అక్కడ బీచ్‌లో కుర్చీ వేసుకొని కాసేపు సేద తీరారు.  సముద్రంలో సాహసోపేత  ‘స్నోర్కెలింగ్‌’ చేశారు.  బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి సముద్రం ఒడ్డున సరదాగా సమయాన్ని గడిపారు.  ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారాయన. అలాగే సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్‌ ఉండాల్సిందేనని సూచించారు ప్రధాని మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Published on: Jan 04, 2024 06:07 PM