Fog Effect: సినిమాలో చూపే విధంగా.. పర్యాటకులను కనువిందు చేస్తున్న మంచు మేఘాలు

Fog Effect: సినిమాలో చూపే విధంగా.. పర్యాటకులను కనువిందు చేస్తున్న మంచు మేఘాలు

Srikar T

|

Updated on: Dec 07, 2023 | 9:35 PM

అల్లూరి ఏజెన్సీలో కొన్నిచోట్ల అహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. పొగ మంచు దట్టంగా కురుస్తుంది. నిన్న సాయంత్రం వరకు తుపాను కారణంగా వర్షాలు కురిసాయి. ఇంకొన్నిచోట్ల దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అయితే భిన్నంగా వాతావరణం ఉంది. జీకే వీధి మండలం దారకొండ, సీలేరు ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుంది. దట్టంగా ఆయా ప్రాంతాల్లో మంచు అలుముకుంటుంది.

అల్లూరి ఏజెన్సీలో కొన్నిచోట్ల అహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. పొగ మంచు దట్టంగా కురుస్తుంది. నిన్న సాయంత్రం వరకు తుపాను కారణంగా వర్షాలు కురిసాయి. ఇంకొన్నిచోట్ల దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అయితే భిన్నంగా వాతావరణం ఉంది. జీకే వీధి మండలం దారకొండ, సీలేరు ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుంది. దట్టంగా ఆయా ప్రాంతాల్లో మంచు అలుముకుంటుంది. దారాలమ్మ ఆలయం సమీపంలో వంజంగి మేఘాల కొండని తలపించేలా మంచు కురిసింది. ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. మంచు కారణంగా పర్యాటకులు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తుంటే.. రహదారి కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Dec 07, 2023 09:32 PM