AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తడిసి ముద్దవుతున్న తెలుసు రాష్ట్రాలు..

Weather Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తడిసి ముద్దవుతున్న తెలుసు రాష్ట్రాలు..

Anil kumar poka
|

Updated on: Dec 12, 2022 | 8:22 AM

Share

మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీల్లో మాండూస్‌ తుఫాను


మాండూస్ తుఫాను మూలిగే నక్కపై తాటికాయ చందంగా తయారయ్యింది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీల్లో మాండూస్‌ తుఫాను రైతన్నలను కంటతడి పెట్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్ళు లేక గత 20 రోజులుగా రోడ్లపైనే ధాన్యం పోసుకుని రైతన్నలు వాటి అమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయదు, మిల్లర్లు తీసుకోరు. ఏం చేయాలతో తోచక.. రవాణా ఖర్చులు భరించలేక ధాన్యం రోడ్లపైనే కుప్పలు పోసి, ఇప్పుడు మాండూస్‌ తుఫానుతో రైతన్నలు కుప్పయ్యారు. కుండపోత వర్షాల వల్ల తీరని నష్టం వాటిల్లింది. రోడ్ల పై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిపోతుంటే తల్లడిల్లి పోతున్నారు.. రెక్కల కష్టాన్ని కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 12, 2022 08:22 AM