Rains in Telangana: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.! పలు జిల్లాల్లో అలెర్ట్..

|

Sep 09, 2024 | 9:00 AM

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని..

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని.. రాబోయే రెండు రోజుల్లో ఉత్తర దిశగా కదులుతోందని తెలిపింది. ఇక రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది. తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని చెప్పింది. ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌, భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఈ నెల 9 వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.