Hyderabad: బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త అవసరం..

|

Mar 29, 2024 | 5:22 PM

దక్షిణాది నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. సాధారణ ఉష్నోగ్రతల కన్నా 2,3 డిగ్రీల ఎక్కువగా నమోదు అవుతున్నాయంది. మరి ఆ వాతావరణ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

దక్షిణాది నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. సాధారణ ఉష్నోగ్రతల కన్నా 2,3 డిగ్రీల ఎక్కువగా నమోదు అవుతున్నాయంది. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య సమయంలో రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో వడగాలులు వీయనుండగా.. ఉత్తర తెలంగాణతో పాటు భద్రాచలం, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

Follow us on