40 ఏళ్లు దాటాక.. ఇవి తినాలంటున్న నిపుణులు

Updated on: Nov 04, 2025 | 7:14 PM

చాలామంది వయసుతో సంబంధం లేకుండా జంక్‌ఫుడ్‌ తింటూ ఉంటారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకున్నా వయసు పెరిగే కొద్దీ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుందని, అనేక వ్యాధుల‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.ముఖ్యంగా 40 ఏళ్ల‌కు పైబ‌డిన వారు త‌మ ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటున్నారు.

తినే ఆహారం విష‌యంలో అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దని, అశ్ర‌ద్ధ చేస్తే డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. క‌నుక 40 ఏళ్ల‌కు పైబ‌డిన త‌రువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తినడం శ్రేయస్కరం అంటున్నారు. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా సూచించారు. అవేంటో చూద్దాం. నిపుణుల ప్రకారం.. 40 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ప్రతిరోజూ తినే ఆహారంలో ట‌మాటాలు తప్పనిసరిగా ఉండాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లైకోపీన్ అనే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్సర్ వ‌చ్చే ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. ట‌మాటాల‌ను రోజూ సూప్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి స‌హ‌జంగానే కంటి చూపు మంద‌గిస్తుంది. అలాగే బీపీ పెరుగుతుంది. ఈ స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకోవాలంటే చిల‌గ‌డ‌దుంప‌ల‌ను త‌ర‌చూ తినాలి. వీటిల్లో పొటాషియం, బీటా కెరోటిన్‌, ఫైటో కెమిక‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీ పెర‌గ‌కుండా చూస్తాయి. అలాగే కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. 40 ఏళ్ల‌కు పైబ‌డిన వారు రోజూ తప్పనిసరిగా తినాల్సిన మరో ఆహారం కోడిగుడ్డు. రోజూ ఓ కోడిగుడ్డును ఉడ‌క‌బెట్టి తింటే మేలు జ‌రుగుతుంది. గుడ్డులోని ప‌సుపు సొన తీసేసి కేవ‌లం తెల్లని భాగాన్ని మాత్ర‌మే తినాలి. దీని వ‌ల్ల ప్రొటీన్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. కండ‌రాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఎముక‌ల‌కు బ‌లాన్ని అందిస్తాయి. కండ‌రాల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. అలాగే వారంలో రెండు సార్లు పుట్ట గొడుగుల‌ను తింటే మంచిది. వీటి వ‌ల్ల క్యాల్షియం, విట‌మిన్ డి స‌మృద్ధిగా ల‌భిస్తాయి. అలాగే మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. 40 ఏళ్ల‌కు పైబ‌డిన వారు రోజూ ఒక యాపిల్‌ను తింటే ఆరోగ్యానికి మంచిది. దీని వ‌ల్ల కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. అలాగే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ఉండ‌వు. అజీర్తి, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం వంటివి త‌గ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తాయి. అలాగే, రోజూ గుప్పెడు బాదంపప్పును నీటిలో నాన‌బెట్టి తినాలి. దీని వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కీళ్ల నొప్పులు, వాపులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా 40 ఏళ్ల‌కు పైబ‌డిన స్త్రీలు, పురుషులు ఆయా ఆహారాల‌ను రోజూ తింటుంటే వృద్ధాప్యంలో ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండ్ల మీద స్టిక్కర్లు.. వాటిపై నంబర్లు.. దేనికి ??

Gold Price: బంగారం రేటు తగ్గింది.. ఇవాళ తులం ఎంతంటే ??

Earth Quake: విశాఖలో భూప్రకంపనలు..భయంతో జనం పరుగులు

Bigg Boss Madhuri: మాధురి రెమ్యూనరేషన్ ఎంతంటే ??

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్‌కు ఛాన్స్ అంటే.. లైంగిక వేధింపులను లైసెన్స్ ఇచ్చినట్లే