AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి బఠానీలు తింటే నిజంగానే యవ్వనంగా కనిపిస్తారా? వీడియో

పచ్చి బఠానీలు తింటే నిజంగానే యవ్వనంగా కనిపిస్తారా? వీడియో

Samatha J
|

Updated on: May 02, 2025 | 8:43 PM

Share

పచ్చి బఠాణీలు మీకు తెలుసా? అవేనండి పుదీనా రైసులో, బిర్యానీలో వాడుతూ ఉంటాం కదా, పచ్చి బఠాణీలు. బఠాణీలు తీసుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. పచ్చి బఠాణీలు వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే పచ్చి బఠాణీలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత మెరుగుపడుతుంది. ఇంకో విషయం గర్భిణీ స్త్రీలు బఠాణీలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పిండ పోషణ మెరుగుపడుతుంది. బఠాణీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి బఠాణీలు చాలా మంచివి. ప

పచ్చి బఠాణీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బఠాణీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బఠాణీలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో సహాయపడతాయి. తరచు ఆహారంలో పచ్చి బఠాణీలు చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. పచ్చి బఠాణీల్లో రాగి, మాంగనీస్ ఉండటం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు. ఇంకో విషయం, దైనందిన మనం పచ్చి బఠాణీలు తీసుకున్నట్లయితే వృద్ధాప్య చాయలు చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తాం. పచ్చి బఠాణీలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పచ్చి బఠాణీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పచ్చి బఠాణీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటుంది. పచ్చి బఠాణీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే కడుపులో మంచి బాక్టీరియా పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గేందుకు కూడా బఠాణీలు ఉపయోగపడతాయి. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న వారికి బఠాణీలు బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు పచ్చి బఠాణీలు సహకరిస్తాయి. వీటిలో గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం :

నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో

 

ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్‌’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు

 

గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..