ఇది మీకు తెలుసా..? చీమలు కూడా కునుకు తీస్తాయి వీడియో
మనం రోజూ చూసే చీమలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. వాటి జీవితంలో అవి ఎక్కువ సమయం కష్టపడి పనిచేస్తునే ఉంటాయి. అయితే, చీమలు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాయా..? వాటికి అలసట, నిద్ర అనేవి ఉంటాయా..? అనే సందేహాలు మీలో కూడా ఎప్పుడో ఒకసారి కలిగే ఉండొచ్చు.. అయితే, ఇందుకు సమాధానం దొరికింది.! శ్రమ జీవులకు నిదర్శనంగా నిలిచే చీమలు ప్రతీ 12 గంటల వ్యవధిలో సగటున 8 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అది కూడా ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ శక్తిని దాచుకుంటాయట.
ప్రతీ చీమ ఒకేసారి కాకుండా కొన్ని చీమలు విరామంలో ఉంటే మరికొన్ని పనిచేస్తాయట. అంటే షిఫ్టుల వారిగా అన్నమాట. పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయని పరిశోధకులు చెబుతున్నారు ఇందులో రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి. వాటి నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయట.. అంటే రోజు మొత్తంలో 9.4 గంటల సమయం నిద్రిస్తాయట. కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ఒక్కొక్క రకంగా ఉంటుందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. భూమిపై నివసించే జీవుల్లో చీమలు ప్రత్యేకం. అవి చూడటానికి ఇంతున్నా, ఎంతో బరువు మోసుకెళ్లగలవు. వాటి సైజ్‌తో పోలిస్తే చాలా బరువున్న ఆహార పదార్థాలు మోసుకెళ్లడం చాలా మంది గమనించే ఉంటారు. మరి అంతటి శక్తి వాటికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ బలం వెనుక ఉన్న రహస్యం ఏంటి? చీమలతో పోలిస్తే మనుషులు తమ శరీర బరువు కంటే తక్కువ వెయిట్ మోస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో
ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు
గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..
దుర్గమ్మ భక్తులకు అలర్ట్..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత!
వడదెబ్బ ధాటికి ఒక్కరోజే 23 మంది బలి..ఏపీలో పిడుగులతో కూడిన వర్షం
మన ఆర్థికవ్యవస్థకు..3 భయంకరమైన సవాళ్లు.. ఏమిటవి?
అనాథాశ్రమంలో ఉండే యువతులతో పెళ్లంటే ఎగిరి గంతేసిన యువకులు
బార్లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా 'లాస్ట్ పెగ్' వేసి
ఉద్యోగం పోయిందని సంబరాలు..
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

