Papaya: ఆరోగ్యమే కాదు అందానికీ బొప్పాయి భేష్‌ అంటున్న నిపుణులు.

సాధారణంగా ప్రకృతి ప్రసాదించే అన్ని పండ్లూ ఆరోగ్యానికి మంచివే. రోజుకి ఒక్క యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లే పనుండదు అంటారు. ఒక్క యాపిల్‌ మాత్రమే కాదు. ప్రకృతిలో లభించే పళ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అవి మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకు కూడా మంచి ఆరోగ్యాన్నిస్తాయి. బొప్పాయితో ఆరోగ్యం మాత్రమే కాదండోయ్‌.. అందానికి కూడా బొప్పాయి నెంబర్‌ 1 గా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Papaya: ఆరోగ్యమే కాదు అందానికీ బొప్పాయి భేష్‌ అంటున్న నిపుణులు.

|

Updated on: Mar 18, 2024 | 2:04 PM

సాధారణంగా ప్రకృతి ప్రసాదించే అన్ని పండ్లూ ఆరోగ్యానికి మంచివే. రోజుకి ఒక్క యాపిల్‌ పండు తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లే పనుండదు అంటారు. ఒక్క యాపిల్‌ మాత్రమే కాదు. ప్రకృతిలో లభించే పళ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అవి మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకు కూడా మంచి ఆరోగ్యాన్నిస్తాయి. బొప్పాయితో ఆరోగ్యం మాత్రమే కాదండోయ్‌.. అందానికి కూడా బొప్పాయి నెంబర్‌ 1 గా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం మనం బొప్పాయి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలగురించి తెలుసుకుందాం. బాగా పండిన బొప్పాయి చర్మం, జుట్టు, రోగనిరోధక వ్యవస్థ మొత్తానికి మేలు చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. అలాగే కొన్ని సాధారణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బొప్పాయి పండులో మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి ఉంది. అందుకే బొప్పాయి పండును ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్, ఫేస్ ప్యాక్, బాడీ లోషన్ వంటి చర్మ సంబంధిత ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది. బొప్పాయి మన శరీరంలోని అన్ని అవయవాలకు జీవితంలోని అన్ని దశలలో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

2013లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం, విటమిన్ ఎ, బి, సి అధికంగా ఉండే బొప్పాయి మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లను, పపైన్, చైమోపాపైన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. పపైన్ ఎంజైమ్‌లో ప్రొటీన్ కరిగిపోయే గుణాలు ఉన్నాయి, ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. డెడ్ స్కిన్ సెల్స్ ను బొప్పాయి క్లియర్ చేస్తుంది. బొప్పాయిలో లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖం ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. 2017 అధ్యయనం ప్రకారం, బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా, యవ్వనంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.

బొప్పాయి.. చర్మంపై కాలిన గాయాలు ఇతర చర్మ వ్యాధులకు సహజ నివారణిగా పనిచేస్తుంది. బొప్పాయి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కూడా. పొడిబారిన చర్మానికి తిరిగి సహజ తేమను తిరిగి తేవడంలో సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జును మీ చర్మంపై క్రమం తప్పకుండా పూయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. దాని సహజ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జు మీ ముఖానికి సహజ బ్లీచ్‌లాగా పనిచేస్తుంది. బొప్పాయి మీ చర్మపు టాన్ వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని పాపైన్ ఎంజైమ్ మొటిమల మచ్చలు లేదా నల్లబడిన మోచేతులు, మోకాళ్ల వంటి ముదురు చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి