పుచ్చకాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా పుచ్చకాయ గింజలు క్రీయాశీలకంగా పనిచేస్తాయి. కాబట్టి డయాబెటిస్ బాధితులు గింజలను తప్పకుండా తీసుకోవాలి.
పుచ్చకాయ గింజలు మెగ్నీషియంకు పెట్టింది పేరు. కాబట్టి పుచ్చకాయ గింజలను క్రమంతప్పకుండా తీసుకునే రక్తపోటుకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియను మెరుగు పరచడంలో కూడా పుచ్చకాయ గింజలు కీలక పాత్ర పోసిస్తాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూడడంలో ఉపయోగపడుతుంది.
ఇక పుచ్చ కాయ గింజల్లో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు బలంగా మారడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన కండరాలు సొంతమవుతాయి.
పుచ్చకాయ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు.
పుచ్చకాయ గింజలను తీసుకుంటే చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో మొటిమలు, చర్మం ముడతలు పడడం వంటి సమస్యలు దరిచేరవిన నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.