మల్లెపువ్వే కదా అని లైట్‌ తీసుకోవద్దు..! దానికి మించిన దివ్యౌషధం లేదు..

Jyothi Gadda

27 April 2024

మల్లెపువ్వు, వాటి వాసన నచ్చని వారు ఉండరు. ముఖ్యంగా చాలామంది తలలో పెట్టుకోవడానికి, దేవుడి పూజకు మాత్రమే మల్లెపూలను వాడుతూ ఉంటారు. కానీ మల్లెపువ్వు వల్ల మనకి తెలియకుండా బోలెడు లాభాలున్నాయి.

మల్లెపువ్వుని ఒక దివ్య ఔషధంగా కూడా వాడొచ్చు. అందులో ఉండే అనేకమైన ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది. 

మల్లెపూలు చాలా రోగాలకు నివారణగా కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మల్లెపువ్వు చాలా బాగా పనిచేస్తుంది. మానసిక శారీరక అనారోగ్యాలను దూరం చేస్తుంది. 

మన శరీరంలో ఉన్న హార్మోర్ల ను కూడా సమతుల్యం చేయగల సత్తా ఉన్న పువ్వు. ఆసియా ఖండంలో ఎన్నో ప్రాంతాల్లో మల్లెనూనెను డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలకు సహజ నివారణగా వాడుతుంటారు.

చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి జాస్మిన్ ఆయిల్ తో మసాజ్ చేయటం వల్ల కీళ్ల నొప్పుల నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

జాస్మిన్ ఆయిల్ నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ దూరం చేస్తుంది. మనశ్శాంతిని అందిస్తుంది. మానసిక స్థితి , మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది

మల్లెపూల వల్ల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. తెల్లటి మల్లెపువ్వు నూనెతో మన జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల వెంట్రుకలు జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది. కుదుళ్ళకు బలం, జుట్టుని ఆరోగ్యంగా చేస్తుంది.

మంచి సువాసనలు వెదజల్లే మల్లెపువ్వు మనల్ని కూడా అందంగా మార్చగలదు. మల్లె పువ్వులతో చేసే జాస్మిన్ టీ వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెంచుతుంది.  జీర్ణ సమస్యలు తగ్గి బరువు తగ్గుతారు.