ఈ ఊరిలో నడుస్తుంటే కరెంట్ షాక్.. బూట్లు ధరించి తిరగాల్సిందే

27 April 2024

TV9 Telugu

Pic credit - Pixabay 

గత కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రతన్‌పూర్ హైవేకి ఆనుకుని ఉన్న 8 గ్రామాల ప్రజలు నేలపై నడిచేటప్పుడు విద్యుత్ షాక్‌కు గురవుతున్నారు.

విద్యుదాఘాతం

ఒక నివేదిక ప్రకారం ప్రతి గ్రామంలో సుమారు 20 టవర్లు ఉన్నాయి. వీటి ద్వారా 400 నుంచి 800 కేవీ కరెంట్ ప్రవహిస్తుంది.

400 నుంచి 800 KV కరెంట్

ఈ టవర్ల కారణంగా ప్రజలు సమీపంలోని నేలపై చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు విద్యుత్ షాక్ తగిలినట్లు జలదరింపు అనుభూతిని అనుభవిస్తారు.

విద్యుత్ షాక్

భూమితో పాటు, ప్రజలు మెటల్ వస్తువులు, చెట్లు, మొక్కలు, చేతి పంపులు మొదలైన వాటిని తాకినప్పుడు  తేలికపాటి విద్యుత్ షాక్‌ గురైనట్లు ఫీల్ అవుతారు. 

చెట్లు, మొక్కలు, 

ఈ విద్యుత్ షాక్‌ నుంచి తమని తాము రక్షించడానికి ప్రజలు పొడవాటి బూట్లు లేదా గమ్ బూట్లు ధరించి నేలపై నడవాల్సిందే. 

లాంగ్ బూట్లు 

బిలాస్‌పూర్‌తో పాటు, అమ్తారా గ్రామంలోని గ్రామ ప్రజలు తమ నెట్టి మీద కూరగాయలు లేదా గడ్డి మూటను మోస్తున్నప్పుడు జలదరింపు అనుభూతి చెందుతారు.

గడ్డిలో కూడా కరెంట్

ఇలా గ్రామాల్లో హైటెన్షన్‌ టవర్‌ల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని బిలాస్‌పూర్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సీఎస్‌పీడీసీఎల్‌ అంజంధర్‌ చెప్పారు. 

చీఫ్ ఇంజనీర్ ఏం చెప్పారు?

ట్రాన్స్‌మిషన్ డిపార్ట్‌మెంట్ నుంచి సమాచారం తీసుకున్న తర్వాత ఈ విద్యుత్ సమస్య  పరిష్కరించబడుతుంది. అవసరమైతే దీనిపై కూడా విచారణ చేస్తామని చెప్పారు.

సమస్యకు పరిష్కారం