పెళ్లింట విషాదం.. ముగ్గురుని మింగేసిన రోడ్డు ప్రమాదం
పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ పెళ్లి బృందంలోని ముగ్గురిని బలిగొంది. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీమదేవరపల్లి మండలం గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెందిన యువతికి, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవల వివాహం జరిగింది.
పెళ్లి వేడుకల్లో భాగంగా నల్లపూసల వేడుక కోసం వధువు తరఫు బంధువులు వరుడి ఇంటికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి బొలెరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద వీరు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి బొలెరోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 12 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పెళ్లింట జరిగిన ఈ ప్రమాదంతో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో ఆహార సంక్షోభం.. ఎమర్జెన్సీ ప్రకటన
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. ఎకరాకు రూ.10 వేల పంటనష్టం..
Tamannaah Bhatia: ఏజ్ బార్ ఇష్యూ గురించి మాట్లాడిన తమన్నా
Shah Rukh Khan: ఆసక్తికరంగా మారిన షారుఖ్ – సిద్ధార్థ్ డిస్కషన్
Sukumar: రంగస్థలం సినిమాకి సుకుమార్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా