Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు ఊడిపోతోందా? కాలేయం పరీక్ష చేసుకోవాల్సిందే వీడియో

జుట్టు ఊడిపోతోందా? కాలేయం పరీక్ష చేసుకోవాల్సిందే వీడియో

Samatha J

|

Updated on: May 19, 2025 | 4:31 PM

మన బాడీలో లివర్ ఫంక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఒకవేళ సరిగ్గా లేనట్లయితే అది ఎలాంటి సింప్టమ్స్ అనేది తెలియజేస్తుంది? దానికోసం ఈరోజు మాట్లాడుకుందాం. మన ఒంట్లో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటే. ఇది జీవక్రియ, విషపదార్థాల తొలగింపు, హార్మోన్ల నియంత్రణ, పోషకాల శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అది శరీరం లోని వివిధ అవయవాలను ప్రభావితం చేస్తుంది. వాటిలో ఒకటి జుట్టు. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. కాలేయం శరీరం నుండి హానికరమైన విషపదార్థాలను తొలగిస్తుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు ఈ టాక్సిన్స్ పేరుకుపోతాయి.

 ఇది చర్మంతో పాటు జుట్టును నేరుగా ప్రభావితం చేస్తుంది. జుట్టు గరుకుగా, నిస్తేజంగా మారుతుంది. విషపదార్థాలను వడపోయడం, జీర్ణక్రియకు సహాయపడటం, శక్తిని నిలువచేయడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం వంటి కీలకమైన పనులను కాలేయం నిర్వర్తిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లివర్ ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. కాలేయ సమస్యలు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ కాలేయ సమస్యలు జుట్టును కూడా ప్రభావితం చేస్తాయా? కాలేయం జుట్టు మధ్య సంబంధం ఉందా? కాలేయం దెబ్బతినడం వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుందా లేదా? జుట్టు బూడిద రంగులోకి మారుతుందా? కాలేయ సమస్యలు మీ జుట్టుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఇప్పుడు చూద్దాం. కాలేయం దెబ్బతిన్నప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి మన బాడీలో. అవి ఏంటంటే జుట్టు అనేది త్వరగా ఊడిపోతూ ఉంటుంది. మీ కళ్ళు అనేవి పసుపు రంగులో మారిపోతాయి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల మీ జుట్టు సన్నగా, పొడిబారినట్లుగా మారుతుంది. సో ఈ రకమైన సింప్టమ్స్ అనేది మీ బాడీలో జరుగుతున్నప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకోకూడదు.

మరిన్ని వీడియోల కోసం :

క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో

పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో

కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో