Cable Bridge Collapse Live updates: గుజరాత్ లో కూలిన కేబుల్ బ్రిడ్జి..100 మంది జలసమాధి..(లైవ్)
గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోర్చిలో ఆదివారం కేబుల్ బ్రిడ్జి కూలిపోయి మొదట మృతుల సంఖ్య 60 మంది వరకు ఉండగా, తర్వాత 90 మందికిపైగా చేరింది.
ప్రమాదానికి గురైన కేబుల్ బ్రిడ్జి చాలా పురాతనమైనది. వందేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి. ఈ వంతెనను143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు. అనాడు ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.5 లక్షల ఖర్చు చేయగా, బ్రిడ్జికి అవసరమైన సామాగ్రి మొత్తం ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు.దర్బార్ గఢ్-నాజర్ బాగ్‌ను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జి పొడవు 765 అడుగులు. దీనికి అధికారులు మూడు రోజుల కిందటే మరమ్మతులు చేపట్టారు. గత రెండేళ్లుగా ఈ కేబుల్ వంతెన మూసివేయగా, గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న మరమ్మతులు చేపట్టి తిరిగి ఓపెన్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పూల్ మహాప్రభుజీ సీటు, సమకంఠ ప్రాంతం మొత్తాన్ని కలుపుతుంది. ఈ కేబుల్ వంతెన గుజరాత్‌లోని మోర్బీకే కాకుండా యావత్ దేశానికి చారిత్రక వారసత్వం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
