Kuppam: కుప్పంలో ఏనుగుల టెన్షన్.. పొలాలు, సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు..!

Edited By:

Updated on: Dec 13, 2023 | 12:35 PM

తమిళనాడు-కర్ణాటక అధికారుల పోటాపోటీ డ్రైవ్‌లతో గందరగోళం ఏర్పడింది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాన్ని ఏనుగుల గుంపు భయపెడుతోంది. ఏపీ-కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని వణికిస్తున్నాయి. కర్ణాటక నుంచి కుప్పం వైపు దూసుకొస్తున్న 70 ఏనుగుల గుంపు ఏ క్షణంలో ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందోనన్న ఆందోళన వెంటాడుతోంది.

కుప్పం సరిహద్దు ప్రాంతాన్ని ఏనుగుల గుంపు వణికిస్తోంది. అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. అడవిలోకి పంపేందుకు చర్యలు చేపట్టినా.. తమిళనాడు-కర్ణాటక అధికారుల పోటాపోటీ డ్రైవ్‌లతో గందరగోళం ఏర్పడింది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాన్ని ఏనుగుల గుంపు భయపెడుతోంది. ఏపీ-కర్ణాటక-తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని వణికిస్తున్నాయి. కర్ణాటక నుంచి కుప్పం వైపు దూసుకొస్తున్న 70 ఏనుగుల గుంపు ఏ క్షణంలో ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందోనన్న ఆందోళన వెంటాడుతోంది.

ప్రస్తుతం కర్ణాటక పరిధిలోని కామసముద్రం దగ్గర తిష్ట వేసిన ఏనుగుల గుంపును ఏపీ వైపు డ్రైవ్ చేస్తుండటంతో హైఅలర్ట్ ప్రకటించారు అటవీశాఖ అధికారులు. పొలాలు, సరిహద్దు ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. కర్ణాటక నుంచి గుడిపల్లి మండలం చిగురుగుంట్ల మైన్స్, బిశానత్తం ప్రాంతాల్లోకి ఏనుగుల గుంపు వచ్చే అవకాశం ఉండటంతో చిత్తూరు జిల్లా అటవీ శాఖ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. అడవిలోకి పంపేందుకు అధికారులు యానిమల్ క్రాకర్స్‌తో డ్రైవ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు తమిళనాడు సులగిరి, కర్ణాటక కామసముద్రం సరిహద్దుల్లోనే ఏనుగుల గుంపు తిష్ట వేసింది. దీంతో తమిళనాడు-కర్ణాటక అటవీ అధికారులు పోటాపోటీగా ఎలిఫెంట్ డ్రైవ్ చేస్తున్నారు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో గజరాజులను కూడా గందరగోళానికి గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది.

 

Published on: Dec 13, 2023 12:34 PM