దారుణం.. క్యాన్సర్‌ ఉన్న బామ్మను.. చెత్తకుప్పలో పడేసిన మనవడు వీడియో

Updated on: Jun 27, 2025 | 4:36 PM

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన జరిగింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలి పట్ల ఆమె కుటుంబం దారుణంగా ప్రవర్తించింది. ఆమెను చెత్తకుప్ప వద్ద పడేసి మనవడు కర్కశంగా వదిలేసాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వృద్ధురాలిని యశోద గైక్వాడ్‌గా గుర్తించారు.

స్కిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తనను మనవడు చెత్తకుప్ప వద్ద పడేసినట్లు పోలీసులకు ఆమె తెలిపింది. తన కుటుంబ సభ్యులు మలాడ్‌, కాండివాలిలో నివసిస్తున్నట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆమె ఫొటోను ఆయా పోలీస్‌ స్టేషన్లకు పంపారు. మరోవైపు చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని హాస్పిటల్‌లో చేర్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి అడ్మిట్‌ చేసుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. చివరకు శనివారం సాయంత్రం 5:30 గంటలకు ఆ వృద్ధురాలిని కూపర్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వృద్ధురాలిని చెత్తకుప్ప వద్ద మనవడు ఎందుకు పడేశాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

దారుణం.. అందరూ చూస్తుండగానే భర్తను కాల్చి.. భార్యాపిల్లల కిడ్నాప్ వీడియో

వీళ్లు మనుషులేనా? మురుగు గుంటలో కోడలిని పూడ్చి..లేచిపోయిందని ప్రచారం

వాచ్ చూడకుండానే టైమ్ చెప్పేస్తున్న బిచ్చగాడు వీడియో