విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’

Updated on: Oct 17, 2025 | 8:25 PM

ఐటీ దిగ్గజం గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో ఏఐ హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుంది.‌ ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగాన్ని మలుపు తిప్పే గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుంది. విశాఖలో గూగుల్‌ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్‌ మాత్రమే కాకుండా కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్స్‌ ప్రాసెస్‌ చేసేందుకు అవసరమైన కంప్యూటింగ్‌ సదుపాయాల్ని కూడా.

దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో విశాఖపట్నంలో 1 గిగావాట్‌ ఏఐ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌ అన్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీ ఏఐ హబ్‌ అని ప్రకటించారు. ఇప్పుడు గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థ అమెరికాకి వెలుపల అతిపెద్ద ఏఐ డేటా హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయడంతో ఆ నగరం భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఐటీ రంగంలో ఎదిగేందుకు దోహదం చేస్తుంది. ఈ ప్రాజెక్టుతో ప్రపంచం మొత్తం విశాఖవైపు చూస్తుంది. ఐటీ కంపెనీలతో పాటు, ఇతర రంగాలకు చెందినవారు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. గూగుల్‌ ప్రాజెక్టుతో విశాఖ గ్లోబల్‌ కనెక్టివిటీ హబ్‌గా మారనుంది. సముద్రంలో వేసే కేబుళ్ల ద్వారా విశాఖ నుంచి 12 దేశాలతో గూగుల్‌ అనుసంధానమవుతుంది. జెమినీ ఏఐతో పాటు గూగుల్‌ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్‌ ద్వారా అందుతాయి. ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు ఇక్కడ తయారవుతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??

శేషాచలంలో అరుదైన ప్రాణులు

అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా

పంట రక్షణకు.. పగటి వేషం నిజమైన ఎలుగుబంటి అనుకొని