Telangana: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌లో ఐరన్ రోల్స్‌తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. గూడ్స్ రైలు కర్ణాటకలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు వెళుతోంది.
పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఐరన్ లోడ్స్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడటంతో రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో ఢిల్లీ-చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు బళ్ళారి నుంచి గజియాబాద్ వెళ్తుండగా.. ఈ ఘటన రాఘవాపూర్ సమీపాన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే సిబ్బంది.. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపేశారు.
ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్‌లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేయగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇక ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్.. రైల్వే జీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. పెద్దపల్లి-రామగుండం మార్గంలోని ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం వరకు రైల్వే ట్రాక్‌ను పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇది చదవండి:
చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..