ఢిల్లీ మెట్రోలో గోల్డెన్‌ లైన్‌.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం

|

Feb 27, 2024 | 8:46 PM

ఢిల్లీ మెట్రోలో కారిడార్లను వివిధ రంగులతో గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కారిడార్ల రంగులను మారుస్తున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఫేజ్ 4 ప్రాజెక్ట్‌లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్‌లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్‌ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్‌ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీ మెట్రోలో కారిడార్లను వివిధ రంగులతో గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కారిడార్ల రంగులను మారుస్తున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఫేజ్ 4 ప్రాజెక్ట్‌లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్‌లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్‌ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్‌ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాచారం ప్రకారం మెట్రో కోచ్‌లలో వెండి రంగు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే దీనిని గోల్డెన్ లైన్ కారిడార్‌గా మార్చారు. ఇది 23.62 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మొత్తం 15 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025నాటికి ఇవి పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు. ఫేజ్-4లో గోల్డెన్ లైన్‌తో పాటు మరో రెండు కారిడార్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జనక్‌పురి వెస్ట్ నుండి ఆర్‌కే ఆశ్రమం వరకు మెజెంటా లైన్‌ను, మజ్లిస్ పార్క్ నుండి మౌజ్‌పూర్ వరకు పింక్ లైన్‌ను పొడిగించనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే ట్రాక్‌పై ట్రక్ బోల్తా.. ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు

Jayalalitha: జయలలిత నగలు వేలం !! వచ్చిన డబ్బుతో ??

మొబైల్‌ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం

శ్రీశైల మల్లికార్జునుడికి బంగారుపళ్లెం కానుక..ఎవరు ఇచ్చారంటే ??

మరణం ఎవరికైనా బాధాకరమే !! కన్నీరు పెట్టిస్తున్న వీడియో

Follow us on