శివనామస్మరణతో మారుమోగుతున్న గోదావరి తీరం వీడియో

Updated on: Feb 16, 2026 | 8:01 AM

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలిరావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తెల్లవారుజాము నుండే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, కోటిపల్లి, మురమళ్ళ వంటి ప్రాంతాల్లోని శివాలయాల్లో భోళాశంకరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో గోదావరి తీరాలు మారుమోగిపోయాయి. ఈ సందర్భంగా అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులు లోతులకు వెళ్లకుండా జల్లుస్నానాలను కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!