గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ

Updated on: Jan 26, 2026 | 4:40 PM

గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రాణాంతక స్థితిలో ఉన్న జాహెదా బేగంకు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కుడి కిడ్నీలో భారీ కణితి IVC వరకు వ్యాపించగా, యూరాలజీ విభాగం విజయవంతంగా తొలగించింది. కార్పొరేట్ స్థాయిలో ఉచిత చికిత్స అందించి, ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యాన్ని నిరూపించారు. ఈ అరుదైన విజయం హైదరాబాద్ వైద్య సేవలకు గర్వకారణం.

హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన వైద్య ఘనత సాధించారు. ప్రాణాంతక స్థితిలో ఉన్న 41 ఏళ్ల జాహెదా బేగం అనే మహిళకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. స్వల్ప కడుపు నొప్పితో గాంధీ ఆసుపత్రిలో చేరిన మహిళకు నిర్వహించిన పరీక్షల్లో కుడి కిడ్నీలో భారీ కణితి ఉన్నట్లు తేలింది. యూరాలజీ విభాగంలో సి.ఇ.సి.టి, ఎం.ఆర్.ఐ, డాప్లర్ స్కానింగ్‌లు చేయగా, కణితి కిడ్నీని దాటి శరీరంలోని ప్రధాన రక్తనాళమైన ఐవీసీ (IVC) లోపలికి వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ స్థితిగా వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం ఉన్నప్పటికీ యూరాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ జి.రవిచందర్ నేతృత్వంలో వైద్య బృందం క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించింది. క్యాన్సర్ బారిన పడిన కుడి కిడ్నీని పూర్తిగా తొలగించి, ఐవీసీలో ఉన్న కణితిని విజయవంతంగా తొలగించి రక్తనాళాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా యూరాలజీ హెచ్.ఓ.డి డాక్టర్ జి. రవిచందర్ మాట్లాడుతూ ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడానికి నిరంతరం సహకారం అందించిన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, సివిల్ సర్జన్ ఆర్ యం ఓ డాక్టర్ శేషాద్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ మధుసూదన్ గారి సేవలను ప్రశంసిస్తూ.. ఈ కేసు కోసం ఉస్మానియా ఆసుపత్రి నుండి ప్రత్యేకంగా వచ్చి, తన అమూల్యమైన నైపుణ్యంతో సహకరించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సి.హెచ్. మధుసూదన్ గారి కృషి అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సి.టి.వి.ఎస్ విభాగం , అనస్థీషియా విభాగం అందించిన సహకారం మరువలేనిదని ఆయన కొనియాడారు. వైద్యబృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో, అదీ ఉచితంగా చికిత్స అందించినందుకు రోగి కుటుంబ సభ్యులు వైద్యులకు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

‘ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు’ హీరోయిన్ ఎమోషనల్

‘పెళ్లికి ముందే అమ్మాయితో అసభ్యంగా దొరికాడు.. కోపంతో చితకొట్టిన క్రికెటర్’

రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం.. పువ్వులు చల్లిన స్థానికులు

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం