పేదరికం నుంచి సక్సెస్ వరకు.. సంతోష్ శ్రీమలే వ్యాపార కలను టాటా ACE ఎలా నెరవేర్చిందో చూడండి!
బెంగళూరులో పేదరికం నుంచి B2B పండ్ల సరఫరా వ్యాపారిగా ఎదగడానికి సంతోష్ శ్రీమలే చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇది. దృఢ సంకల్పం, టాటా ACE వంటి సరైన భాగస్వామి తోడైతే ఏమేమి సాధించగలరో అందుకు సరైన ఉదాహరణ సంతోష్ శ్రీమలే జర్నీ..
కొన్నేళ్ల క్రితం సంతోష్ శ్రీమల్ అనే వ్యక్తి మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ స్వస్థలం వదిలి బెంగళూరుకు వచ్చాడు. అయితే వ్యాపారాన్ని ప్రారంభ తగిన వనరులు అతని వద్ద లేవు. కానీ సంకల్ప శక్తి నిండుగా ఉంది. దీంతో చేసిదిలేక స్థానిక పండ్ల దుకాణంలో పనికి చేరాడు. ఈ అనుభవమే అతనికి B2B పండ్ల సరఫరా వ్యాపారానికి లోతైన అవగాహన అందించింది. 2012లో సంతోష్‌కి అవసరమైన నిధులను సమకూరడంతో తన మొదటి టాటా ACE కొనుగోలు చేశాడు. వాహనం కొనుగోలు చేశాక సొంతంగా పండ్ల సరఫరా వెంచర్‌ను ప్రారంభించాడు. అతని వ్యవస్థాపక స్ఫూర్తి, పరిశ్రమ అవగాహన వ్యాపారానికి బలమైన పునాది వేసింది. దీంతో అతడి వ్యాపారం 2017 నాటికి సాయి ఫార్మకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ఇది అతని జీవితంలో ఒక కీలక మలుపు.
ప్రస్తుతం సంతోష్ 70 టాటా ACEలు కలిగి ఉన్నాడు. వీటి ద్వారా బెంగళూరు నగరమంతా పండ్లను సరఫరా చేస్తున్నాడు. ITC, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటి ప్రముఖ కంపెనీలతో కలిసి పని చేస్తున్నాడు. అతని కంపెనీలో ప్రస్తుతం 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మిస్తూనే ఉద్యోగాలను సైతం సృష్టిస్తున్నాడు. పేదరికం నుంచి మొదలైన అతని ప్రయాణం.. ఇప్పుడు సక్సెస్ బాటలో పరుగులు తీస్తుంది. ఇది నిజంగా సంతోష్‌కు ‘అబ్ మేరీ బారీ’ ప్రారంభం. పేదరికం నుంచి సక్సెస్ వరకు సంతోష్ కథ కష్టపడి పనిచేసే శక్తికి, టాటా ACE విశ్వసనీయతకు నిదర్శనంగా నిలిచాయి. భారతదేశ నవయుగ వ్యవస్థాపకులకు ఇది నిజమైన సహచరుడు.