కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యా.. న్యూట్రిషనిస్ట్ కథ వైరల్
21 ఏళ్ల వయసులో ధనవంతుడిని పెళ్లి చేసుకోవడమే విజయమని భావించిన రాశి చౌదరి.. 41 ఏళ్లకు రెండు వ్యాపారాలు, 40 మంది ఉద్యోగులతో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. పెళ్లి, డబ్బు కంటే తనకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడమే జీవితాన్ని మార్చిందని ఆమె చెప్పిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మహిళలకు స్ఫూర్తినిస్తోంది.
సక్సెస్ కి ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో అర్థం ఉంటుంది. వయసు, అనుభవాలను బట్టి దాని నిర్వచనం మారుతూ ఉంటుంది. చిన్నవయసులో మంచి ఉద్యోగం, పెద్ద జీతం, ఇల్లు, కారు, పెళ్లి విజయానికి కొలమానాలుగా భావిస్తాం. కానీ, జీవితం వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు మన ప్రయాణంలో ఎదురైన కష్టనష్టాలే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయని తెలుస్తుంది. 21 ఏళ్ల వయసులో తాను ఊహించిన విజయానికి, 41 ఏళ్ల వయసులో తాను పొందిన విజయానికి ఉన్న తేడాను వివరిస్తూ దుబాయ్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్న న్యూట్రిషనిస్ట్ రాశి చౌదరి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 21 ఏళ్ల వయసులో నేను ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని, ఇద్దరు పిల్లలతో గృహిణిగా స్థిరపడాలని కలలు కన్నానని చెప్పింది. కానీ ఈ రోజు 41 ఏళ్ల వయసులో తనకు ఇంకా పెళ్లి కాలేదనీ 40 మంది ఉద్యోగులతో రెండు వ్యాపారాలను నడుపుతున్నాననీ ఆమె రాసుకొచ్చారు. ఒకప్పుడు తను కోరుకున్నట్టుగా తానే ధనవంతురాలిని అయ్యానేమో అనిపిస్తోంది అంటూ రాశి తన వీడియోలో అన్నారు. తను అనుకున్న అసలు ప్లాన్ నిజానికి ఫలించిందని చెప్పారు. 25 ఏళ్లకే తనకు ధనవంతుడైన భాగస్వామి దొరికాడనీ అన్నారు. కానీ అప్పుడు కూడా అది తన జీవితంలా ఎందుకు అనిపించడం లేదు? అని తనలో తనే మథనపడేదాన్నని ఆమె గుర్తుచేసుకున్నారు. మన సమాజంలో మహిళలకు రెండు విషయాలు నేర్పుతారని చెప్పారు. ఒకటి పురుషుడు ఎంచుకునేంత ఆకర్షణీయంగా ఉండాలి. లేదా ఎవరి అవసరం రానంత విజయవంతంగా ఉండాలి. ఈ రెండు ఆలోచనలతోనే మహిళలు తమ జీవితాంతం పోరాడుతూ, చివరికి వారి ఆమోదం కోసమే బతుకుతారు అని ‘న్యూట్రిషన్ ఇన్ సింక్’ వ్యవస్థాపకురాలైన రాశి విశ్లేషించారు. చాలా మంది భారతీయ మహిళలలాగే తానూ ఇతరుల చేత ‘ఎంపిక’ కావడానికి వీలుగా తనను తాను మలుచుకోవడానికి ప్రయత్నించానని రాశి తెలిపారు. పెళ్లి, విడాకులు, విజయం లేదా డబ్బు కంటే ఎక్కువగా, తనేం కోరుకుంటున్నానో తెలుసుకోవడమే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. ఆ స్వీయ అన్వేషణ ముందు ఇవన్నీ చాలా చిన్నవి అని తెలిపారు. తనకు నిజంగా ఏం కావాలో నిర్ణయించుకునే ధైర్యం కలిగి ఉండటమే అసలైన స్వేచ్ఛ అని తన అభిప్రాయాన్ని తెలిపారు. రాశి చౌదరి పోస్ట్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మృణాల్ ఠాకూర్ ‘బెస్ట్’ అని కామెంట్ చేసారు. వయసు, అనుభవాలతో లక్ష్యాలు ఎలా పరిణితి చెందుతాయో చెందుతాయో చెప్పడానికి రాశి చౌదరి కథ ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. పండ్ల బాక్స్‌లో ఉన్నది చూసి గుండె గుభేల్!
ఇదేం దొంగతనం సామీ.. బంగారంతో పాటు ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..!
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

