ఇది పొగ లేని సిగరెట్‌ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

Updated on: Jul 15, 2025 | 8:22 AM

జెన్ Z వినియోగదారుల కోసం టిక్‌టాక్‌లో ఒక వింతైన కొత్త ట్రెండ్ వైరలవుతోంది. దీనిని ఫ్రిజ్ సిగరెట్ అని పిలుస్తున్నారు. దీనికి ధూమపానంతో సంబంధం లేదు. బదులుగా, ఇది ఫ్రిజ్‌లోకి చేరుకోవడం, చల్లని డైట్ కోక్ తీసుకోవడం, నెమ్మదిగా సిప్ చేయడంతో ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారట.

అదేంటో చూద్దాం..!వారు పొగ తాగరు, కానీ వారికి ఓ ‘సిగరెట్’ కావాలి. ఏంటిది అనుకుంటున్నారా? ఇదే ఇప్పుడు జెన్-జెడ్ యువతలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘ఫ్రిజ్ సిగరెట్’. ఇది నిజమైన సిగరెట్ కాదు.. పని ఒత్తిడి, డిజిటల్ అలసట నుంచి ఐదు నిమిషాలు ఉపశమనం పొందేందుకు చల్లటి డైట్ కోక్‌ను తాగడాన్ని ఇలా పిలుస్తున్నారు. ఈ కొత్త అలవాటు సోషల్ మీడియా, ముఖ్యంగా టిక్‌టాక్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. గంటల తరబడి సాగే జూమ్ మీటింగ్స్, ఈమెయిల్స్ వంటి డిజిటల్ ప్రపంచంలో నిరంతరం పనిచేసే యువతకు ఓ చిన్న విరామం అవసరం. అలాంటి సమయంలో ఫ్రిజ్‌లోంచి చల్లటి డైట్ కోక్ తీసి, దాన్ని ఓపెన్ చేసినప్పుడు వచ్చే శబ్దం, నురుగును ఆస్వాదిస్తూ తాగడం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తోందని అంటున్నారు. సిగరెట్ తాగినప్పుడు కలిగే ఫీలింగ్‌ను ఇది ఇస్తుండటంతో, దీనికి సరదాగా ఫ్రిజ్ సిగరెట్ అని పేరుపెట్టుకున్నారు. పొగ తాగే అలవాటుకు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమని చాలామంది భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు వీడియో

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో

పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో