ఉచితగా AI కోర్స్ ఈ విధంగా నేర్చుకోండి.. జీవితంలో సెటిల్ అవ్వండి
భవిష్యత్తు AI టెక్నాలజీదే. విద్యార్థులకు టాప్ కెరీర్‌గా మారిన AI నైపుణ్యాలను కేంద్రం ఉచితంగా అందిస్తోంది. 'స్వయం' పోర్టల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన AI కోర్సులను పూర్తి చేయవచ్చు. పైథాన్, మెషిన్ లెర్నింగ్ మొదలు, వివిధ రంగాలకు ఉపయోగపడే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇది డిజిటల్ నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే వారికి అద్భుత అవకాశం.
భవిష్యత్ AI టెక్నాలజీదే అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు AIని కెరీర్ ఎంపికగా ఎంచుకుంటున్నారు. ఇది విద్యార్థుల టాప్ కెరీర్ ఆప్షన్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏఐ స్కిల్స్‌ను ఫ్రీగా నేర్పేందుకు ‘స్వయం’ పోర్టల్ ద్వారా కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రభుత్వ గుర్తింపుతో కూడిన సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. ఈ కోర్సులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల నిపుణులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. పైథాన్ ఉపయోగించి ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాల నుంచి మొదలుకొని, క్రికెట్ విశ్లేషణలో ఏఐ వాడకం, ఉపాధ్యాయులకు తరగతి గదిలో ఏఐ వినియోగం లాంటి కొత్త కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీలో పరిశోధనలకు, ఫైనాన్స్, అకౌంటింగ్ రంగాల్లో ఆటోమేషన్‌కు ఏఐను ఎలా ఉపయోగించవచ్చో నేర్పే కోర్సులు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ జర్నలిస్టుల నుంచి సైన్స్ విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా వీటిని తీర్చిదిద్దారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా స్వయం అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి, తమకు నచ్చిన కోర్సును ఎంచుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయి ఈ ఉచిత కోర్సుల్లో చేరవచ్చు. డిజిటల్ నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఒక మంచి అవకాశం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సార్ టాలెంట్ మామూలుగా లేదు.. స్మగ్లింగ్ లో సరికొత్తగా ట్రై చూసారుగా
అరే.. బాబు అవి పాములు రా.. పొట్లకాయలు కాదు.. మీకు వీడియో చూసే ధైర్యముందా
Priyanka Chopra: ప్రియాంక తెలుగు ఎంత క్యూట్‌గా ఉందో
