న్యూ లుక్‌తో మెరిసిపోతున్న ఎయిర్‌ ఇండియా విమానాలు

|

Oct 09, 2023 | 8:06 PM

టాటా సన్స్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇండియా విమానాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఎయిర్‌ ఇండియాను తమ ఆధీనంలోకి తీసుకున్న టాటా గ్రూప్ ఆ తర్వాత సంస్థలో కొన్ని మార్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే సంస్థ లోగోతోపాటు విమానాల రూపురేఖలూ మార్చేసింది. ఎయిర్ ఇండియా కొత్త లోగోతో కూడిన విమానం ఫస్ట్ లుక్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది. రాజసం ఉట్టిపడేలా కొత్త లుక్ ఉందని కామెంట్ చేసింది.

టాటా సన్స్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇండియా విమానాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఎయిర్‌ ఇండియాను తమ ఆధీనంలోకి తీసుకున్న టాటా గ్రూప్ ఆ తర్వాత సంస్థలో కొన్ని మార్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే సంస్థ లోగోతోపాటు విమానాల రూపురేఖలూ మార్చేసింది. ఎయిర్ ఇండియా కొత్త లోగోతో కూడిన విమానం ఫస్ట్ లుక్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది. రాజసం ఉట్టిపడేలా కొత్త లుక్ ఉందని కామెంట్ చేసింది. నూతన లోగోతో కూడిన విమానాల డెలివరీ మరికొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని ప్రకటించింది. మునుపటి ఎర్రటి షేడ్స్ స్థానంలో గోల్డెన్ కలర్ షేడ్స్‌ను ప్రవేశపెట్టింది. విమానం టెయిల్ భాగంలో కూడా స్వల్ప మార్పులు చేసింది. ఎరుపు, గోల్డెన్, పర్పుల్ రంగులకు చెందిన షేడ్స్‌లోని డిజైన్‌ను జోడించింది. కొత్త డిజైన్లతో కూడిన ఎయిర్‌బస్ ఏ350 విమానం ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ప్రజల మనసుల్లో పాత ఎయిర్ ఇండియా గుర్తులను పూర్తిగా చెరిపేసేందుకు సంస్థ రీబ్రాండింగ్‌కు దిగింది. ఇందు కోసం మొత్తం 18 వేల కోట్లను ఖర్చు పెడుతోంది. సంస్థ ఫ్లీట్లలోని విమానాలకు కొత్త లోగోలు, ఇతర చిహ్నాలను జత చేస్తోంది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా వివిధ మోడళల్లో కొత్త 470 విమానాలను కూడా కొనుగోలు చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి ప్రిన్స్ యావర్ ఇది !! మీమర్స్, ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యాడా ??

Mad: మ్యాడ్ మూవీ రివ్యూ.. బొమ్మ హిట్టా ?? ఫట్టా ??

800: ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ.. 800 హిట్టా ?? ఫట్టా ??

కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో సంబరం

నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి