Video: ఆటోను ఢీకొట్టిన కారు.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం ఏఎస్ పేట వద్ద నెల్లూరు-ముంబై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు.. రోడ్డుపై యూటర్న్ తీసుకుంటున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో సీసీటీవీ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు – ముంబై హైవేపై ఆత్మకూరు మండలం ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఆటో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
వైరల్ వీడియోలు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

