Yatra 2 Song: ఏడిపించేస్తున్న యాత్ర2 పాట.! ఓదార్పు యాత్ర నేపథ్యంలో పాట..
2019లో వచ్చిన ‘యాత్ర’ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహి వి రాఘవ్ అద్భుత, నటన మమ్ముటి నేచురల్ యాక్టింగ్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రానికి యాత్ర 2 పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది.
2019లో వచ్చిన ‘యాత్ర’ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహి వి రాఘవ్ అద్భుత, నటన మమ్ముటి నేచురల్ యాక్టింగ్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ చిత్రానికి యాత్ర 2 పేరుతో సీక్వెల్ తెరకెక్కుతోంది. యాత్ర మొదటి పార్ట్ మంచి విజయం సాధించిన నేపథ్యంలో యాత్ర2పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి పార్ట్‌లో రాజశేఖర్ రెడ్డి పాత్రను లీడ్‌గా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కించగా, యాత్ర2లో రాజశేఖర్ రెడ్డి మరణం, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ఇతివృత్తంగా చేసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్‌లు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
ఈ సినిమాలో జగన్‌మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ యాత్ర 2 నుంచి ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ‘చూడు నాన్న’ అని సాగే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఓదార్పు యాత్ర నేపథ్యంలో ఈ పాట ఉండనున్నట్లు పాట చూస్తే స్పష్టమవుతోంది. ఇక ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. పాట లిరిక్స్‌తో పాటు వీడియో పూర్తి ఎమోషనల్‌గా ఉంది. జీవ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా.. దేవుడి ఫొటోల పక్కన, మమ్ముటి ఫొటో ఉన్న సమయంలో వచ్చే డైలాగ్ కళ్లు చెమర్చేలా ఉన్నాయి. ‘దేవుడు నమ్మకం, వైఎస్సార్ నిజం’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. దీనిబట్టి సినిమా మొత్తం పూర్తి ఎమోషనల్ జర్నీలా సాగేలా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos