Loading video

Pushpa 2 The Rule: తగ్గేదేలే.! టాలీవుడ్ గేమ్ ఛేంజరా పుష్పరాజ్.?

|

Dec 06, 2024 | 11:48 AM

ఏ రంగంలో అయినా ఓ గేమ్ ఛేంజర్ ఉంటుంది. అంటే అంతవరకు మూస పద్దతిలో వెళ్లే దానిని పక్కకునెట్టి కొత్తదారిని చూపిస్తుంది. టాలీవుడ్ కు పుష్పా అలాంటిదేనా? ఎందుకంటే రికార్డుల రారాజుగా మారిన పుష్పరాజ్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ కొత్త మార్గాన్ని సెట్ చేశారా? మార్కెట్ ను పెంచుకోవడానికి పుష్ప టీమ్ అనుసరించిన స్ట్రాటజీ.. ఇప్పుడు రాబోయే సినిమాలకు బాగా ఉపయోగపడుతుందా?

ఏ రంగంలో అయినా ఓ గేమ్ ఛేంజర్ ఉంటుంది. అంటే అంతవరకు మూస పద్దతిలో వెళ్లే దానిని పక్కకునెట్టి కొత్తదారిని చూపిస్తుంది. టాలీవుడ్ కు పుష్పా అలాంటిదేనా? ఎందుకంటే రికార్డుల రారాజుగా మారిన పుష్పరాజ్.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ కొత్త మార్గాన్ని సెట్ చేశారా? మార్కెట్ ను పెంచుకోవడానికి పుష్ప టీమ్ అనుసరించిన స్ట్రాటజీ.. ఇప్పుడు రాబోయే సినిమాలకు బాగా ఉపయోగపడుతుందా? అలా అయితే.. పుష్పాకి ముందు.. పుష్పా తరువాత అనేలా టాలీవుడ్ పరిస్థితి మారబోతోందా? నిజానికి ఈ ప్రశ్నలపై తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా మూవీని తీయడం, నార్త్ మార్కెట్ నూ కొల్లగొట్టడం, కమర్షియల్ గా హిట్ కొట్టి.. సక్సెస్ కావడం ఇవన్నీ టాలీవుడ్ కు బాహుబలి ఎప్పుడో నేర్పించింది. మరిప్పుడు పుష్పా స్పెషలేంటి అనుకోవచ్చు. కానీ పుష్పా కూడా మార్కెట్ స్ట్రాటజీలో హిట్ కొట్టింది. అందుకే బడ్జెట్ కు మించి బిజినెస్ చేయడంలో కాని, కలెక్షన్స సునామీని రప్పించడంలో కాని, పుష్పా-2 కోసం మూడేళ్ల పాటు ప్రేక్షకులతో వెయిట్ చేయించడంలో కాని తిరుగులేని స్ట్రాటజీని అమలు చేసింది. శ్రీవల్లి సాంగ్ కు 165+ మిలియన్ వ్యూస్ సామి సామి పాటకు 224+ మిలియన్ వ్యూస్ ఊ అంటావా మావ పాటకు 190+ మిలియన్ వ్యూస్ ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటకు 73+ మిలియన్ వ్యూస్ ఏదైనా పనిని స్వీట్ తో స్టార్ట్ చేస్తే.. ఆ పనంతా దిగ్విజయంగా జరుగుతుంది...