Weekend Hour: పద్మవ్యూహంలో ప్రగతి చక్రాలు.. RTC విలీనం బిల్లుకు ఆమోదం..?

|

Aug 05, 2023 | 7:06 PM

ఆర్టీసీ విలీన ప్రక్రియలో ఏర్పడిన సందిగ్ధతకు తెరపడుతోంది. కార్మికులతో జరిగిన సమావేశంలో గవర్నర్‌ తమిళిసై సానుకూలంగా స్పందించగా.. అటు ప్రభుత్వం కూడా రాజ్‌భవన్‌ లేవనెత్తిన అంశాలకు స్పష్టమైన వివరణ ఇచ్చింది. అయితే వివాదానికి ముగింపు పడుతుంది అనుకుంటున్న సమయంలో మరోసారి గవర్నర్‌ కార్యాలయం నుంచి ఉద్యోగుల భద్రతపై క్లారిఫికేషన్‌ అడగడంతో మళ్లీ మొదటికి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఈ వ్యవహరం అటు రాజకీయ రంగు పులుముకుంటోంది. విలీనంపై అనుమానాలున్నాయని.. దీనిపై చర్చ జరగాలంటోంది బీజేపీ.

ఆర్టీసీ బిల్లుపై నిన్నటి నుంచి హైడ్రామా చోటుచేసుకుంది.. డ్రాఫ్ట్‌ బిల్లుపై సంతకం పెడితే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టాల్సి ఉంది. అయితే గవర్నర్‌ డ్రాఫ్టులో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కావాలని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించిన కార్మిక సంఘాలు RTC విలీనం బిల్లుకు ఆమోదం తెలిపాలని డిమాండ్‌ చేస్తూ రాజ్‌భవన్‌కు తరలివచ్చారు. ర్యాలీగా వచ్చి రాజ్‌భవన్‌ ఎదుట బైఠాయించారు. ఉదయం ఆర్టీసీ కార్మికులు ర్యాలీతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఆర్టీసీ కార్మికుల ఆందోళనపై స్పందించిన గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌ ముట్టడి బాధించిందన్నారు. పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై.. RTC కార్మిక నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలస్యం చేయడం తనకు ఇష్టం లేదని.. క్లారిఫికేషన్‌ వచ్చిన తర్వాత సంతకం చేస్తామంటూ ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలను స్వాగతించారు కార్మిక సంఘం నేతలు. ఇంకా ఏమైనా సలహాలు ఉంటే బిల్లులో రాసి పంపించాలని కోరారు. రాజభవన్‌ వద్ద ఆందోళనలు, గవర్నర్‌తో కార్మిక సంఘాల సమావేశం జరుగుతుండగానే ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్‌ అడిగిన ఐదు అంశాలపై ప్రభుత్వం వివరణ పంపింది. అయితే ఉద్యోగుల భద్రతపై మరింత క్లారిఫికేషన్ కావాలంటూ రాజ్‌భవన్‌ మరోసారి నోట్‌ పంపింది. అటు ఈ వ్యవహారంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. ఆర్టీసీ ఆస్తులు అమ్మాలని చూస్తున్నారని ఇందులో భాగంగానే విలీనం డ్రామాఅన్నారు బీజేపీ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌. మొత్తానికి ఆర్టీసీ విలీనం తెలంగాణ రాజకీయాల్లో పెనుతుఫాన్‌ సృష్టించింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో? ఏ తీరానికి చేరుతుందో చూడాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...