Allu Arjun: 'ఒక్క ఫోటో అన్నా'.. బన్నీ కోసం ఏడ్చిన ఫ్యాన్స్..

Allu Arjun: ‘ఒక్క ఫోటో అన్నా’.. బన్నీ కోసం ఏడ్చిన ఫ్యాన్స్..

Phani CH

|

Updated on: Feb 09, 2023 | 9:32 AM

అభిమానం అంటే అంతే మరి..! ఓ పక్క చూడాలనే ఆత్రం.. ఇంకో పక్క చూడలేక పోతే ఎలా అన్న అనుమానం! వెరసి ఫ్యాన్స్ మైండ్స్‌లో పెరిగేలా చేస్తుంది అత్యుత్సాహం. ఏమైనా.. ఏం చేసైనా.. తమ ఫెవరెట్ హీరోను చూడాలనేలా..

అభిమానం అంటే అంతే మరి..! ఓ పక్క చూడాలనే ఆత్రం.. ఇంకో పక్క చూడలేక పోతే ఎలా అన్న అనుమానం! వెరసి ఫ్యాన్స్ మైండ్స్‌లో పెరిగేలా చేస్తుంది అత్యుత్సాహం. ఏమైనా.. ఏం చేసైనా.. తమ ఫెవరెట్ హీరోను చూడాలనేలా.. తనను ముందుకు తోస్తుంది. అది కూడా వీలు కాలేదో.. వారిని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. గుక్క పట్టి ఏడ్చేలా మైండ్ ప్రేరేపిస్తోంది. ఎట్ ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. బన్నీ కోసం ఫ్యాన్స్ ఏడుపు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎట్ ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూట్లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ సినిమా కోసమే వైజాగ్‌ వెళ్లారు. అక్కడే పోర్టులో కొన్ని కీ సీన్స్‌ షూట్లో పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలోనూ షూట్ గ్యాబ్‌లో తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌ను మీట్ అవ్వాలనుకున్నారు బన్నీ.

Published on: Feb 09, 2023 09:32 AM