మెకానిక్ రాఖీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే.. ఈ వీడియో చూడాలి కదా..

|

Nov 22, 2024 | 7:36 PM

సినిమాల సంగతి పక్కకు పెడితే.. తన సినిమాకు ప్రమోషన్ చేసుకునే స్ట్రాటజీతో.. ఆ క్రమంలో చేసే కాంట్రో కామెంట్స్‌తో.. ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యే విశ్వక్ సేన్.. తన లేటెస్ట్ రిలీజ్ మెకానిక్ రాకీ ముందు కూడా అదే చేశాడు. ఏదైతేనేం.. తన సినిమాను మొత్తానికి జనాల్లోకైతే బానే తీసుకెళ్లాడు. మరి తాజాగా రిలీజ్‌ అయిన విశ్వక్ మెకానిక్ రాకీ సినిమా ఎలా ఉంది.

ఈ హీరోకు సాలిడ్‌ హిట్‌ నిచ్చిందా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం..! మెకానిక్ రాకీ కథ విషయానికి వస్తే.. నగుమోము రాకేష్ అలియాస్ రాకీ.. అదే మన విశ్వక్‌ సేన్.. బీటెక్ మధ్యలోనే ఆపేసి.. తండ్రి రామకృష్ణ అలియాస్ నరేష్ నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా సెటిల్ అయిపోతాడు. గ్యారేజ్‌లో రిపేర్లు చేయడంతోపాటు.. డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఇక రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ అలియాస్ శ్రద్ధా శ్రీనాథ్, ప్రియ అలియాస్ మీనాక్షి చౌదరి వస్తారు. రాకీ చదువుకునేటప్పుడు తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియ. అందులోనూ ప్రియ తన స్నేహితుడి చెల్లెలు కూడా…! దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమప్రయాణం మొదలు అనుకునేలోపే… నాటకీయ పరిణామాలతో రాకీ బీటెక్ కాలేజ్ వదిలేయాల్సి వస్తుంది. కట్ చేస్తే డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసిన ప్రియ గురించి రాకీకి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అయితే రాకీకి తెలిసిన ఆ కొత్త విషయాలేంటి? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు?వాళ్లిద్దరి జీవితాల్ని మాయ ఎలా ప్రభావితం చేసింది? అనేదే రిమైనింగ్ సినిమా..! స్టోరీ విన్నాక.. ఇదేదో ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీలా ఉందే అని అనుకున్నారు కదా..! కానీ అలా అని చెప్పలేం! సినిమా బిగినింగ్‌లో కొన్ని సీన్స్‌ చూస్తుంటే ఇదేదో రొమాంటిక్ సినిమా అనే అనుకుంటాం.. ! కానీ ఆ తర్వాతే అనూహ్యంగా జానర్ మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఇంకేదో ఉందనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఒక ఓపెన్‌ గా చెప్పాలంటే.. ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ ఉన్న క్రైమ్‌ థిల్లర్ కథగా మెకానిక్ రాకీ మారిపోతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ పెళ్లి చేసుకోనున్న ప్రపంచ కుబేరుడు

TOP 9 ET News: మహేశ్, ప్రభాస్‌లని దాటేసిన బన్నీ! | నయన్ – ధనుష్ వివాదం మధ్యలో మహేష్ పోస్ట్

Mahesh Babu: మెన్స్‌ డే రోజు.. నిజమైన మగాడంటే ఎవరో చెప్పిన మహేశ్ బాబు

Ram Charan: ఆ స్టార్‌కు ఇచ్చిన మాట కోసమే కడప దర్గాకు వచ్చా..

భారత్‌లో మరిన్ని “ట్రంప్ టవర్స్‌” ప్రారంభానికి ట్రంప్ జూనియర్