దర్శకులతో విశాల్‌కు పడట్లేదా ?? మకుటం సినిమాను టేకోవర్ చేసిన తమిళ హీరో

Updated on: Oct 23, 2025 | 7:35 PM

స్టార్ హీరో విశాల్ దర్శకులతో విభేదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మకుటం సినిమా దర్శకుడు రవి అరసు తప్పుకోవడంతో, విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గతంలో తుప్పరివాలన్ 2 విషయంలోనూ మిస్కిన్‌తో విభేదాల కారణంగా విశాల్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇది ఆయన కెరీర్‌లో మరో వివాదానికి తెరలేపింది.

స్టార్ హీరో విశాల్ ఇటీవల తరచుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అవార్డుల ప్రకటనల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన తర్వాత, ఇప్పుడు ఆయన అప్ కమింగ్ మూవీ మకుటం విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే కోలీవుడ్ స్టార్ విశాల్ పేరు మార్మోగుతోంది. మకుటం సినిమా లీడ్ రోల్‌లో విశాల్ నటిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, విశాల్‌తో అభిప్రాయ భేదాల కారణంగా రవి అరసు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను విశాల్ స్వయంగా ధృవీకరించారు. మకుటం సినిమా దర్శకత్వ బాధ్యతలను తానే తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.700 పలుకుతోన్న కిలో టమోటా.. ఇంకేం తింటారు

తరుముకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాల్లో స్కూల్స్‌ బంద్‌

Gold Price Down: లక్ష దిగువకు బంగారం.. ఇదీ అసలు కారణం

దీపావళి బోనస్ ఇవ్వలేదని టోల్ గేట్లు ఎత్తేసారు !! రూ. లక్షల్లో నష్టం

అరటి గెలల కోసం పోటీ.. ఏమిటి వాటికి అంత ప్రత్యేకత