విశాల్ హెల్త్‌ అప్డేట్..! డాక్టర్స్ సీరియస్ వార్నింగ్

Updated on: May 14, 2025 | 1:46 PM

చూడ్డానికి ఫిట్‌గా.. కనిపించే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. ఈ మధ్య ఎక్కువగా సిక్‌ అవుతున్నాడు. అందులోనూ పబ్లిక్ వేదికలపై కాస్త నర్వస్‌గా కనిపిస్తూ.. తన ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తున్నాడు. ఈక్రమంలోనే ట్రాన్స్ జెండర్‌ బ్యూటీ కాంటెస్ట్ కు వెళ్లిన విశాల్.. ఉన్నట్టుండి వేదికపైనే సృహ తప్పి పడిపోయాడు. అయితే ఆయన అలా పడిపోవడానికి కారణం ఆయన డైటింగే అనే అప్డేట్ కోలీవుడ్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక తన అప్‌కమింగ్ సినిమాల్లో ఎట్ ప్రజెంట్ బిజీగా ఉన్న విశాల్..మే 11న మిస్ కువాగం, ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్ కు గెస్ట్‌ గా వెళ్లాడు. ఈ ఈవెంట్‌ జరుగుతుండగానే.. ఉన్నట్టుండి వేదికపైనే కుప్పకూలిపోయాడు విశాల్. దీంతో ఆ షో నిర్వాహకులు ఆయన్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి…ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్లీ ఆ షోకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అయితే తమిళ మీడియా కోట్ చేసిన విశాల్ హెల్త్‌ అప్డేట్ ప్రకారం.. విశాల్ ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయారట. తన అప్‌కమింగ్ సినిమా కోసం ఆయన టఫ్‌ డైట్‌ను ఫాలో అవుతున్నారట. అందులోనూ షో అనుకున్న టైం కంటే ఎక్కువ సేపు అవ్వడం.. ఎండ, వేడి, ఉక్కపోతతో.. ఒక్కసారిగా నీరసంతో విశాల్ కుప్పకూలి ఉండొచ్చని కోలీవుడ్‌ మీడియా తమ ఆర్టికల్స్‌లో కోట్ చేసింది. అంతేకాదు డైటింగ్ మానుకోవాలని.. ఈయనకు ట్రీట్మెంట్ చేసిన వైద్యులు కాస్త గట్టిగా చెప్పినట్టు తమ ఆర్టికల్స్‌ లో రాసుకొచ్చింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే… ప్రస్తుతం విశాల్ ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. దీంతో విశాల్ అభిమానులు కాస్త హ్యాపీగా ఫీలవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒత్తిడి తగ్గించే అద్భుత రహస్యం..

ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే

మీ మిక్సీ మొరాయిస్తోందా.. ఇలా చేయండి.. దారికొస్తుంది

ఉరుములకు భయపడిన ఉడుత..ఏం చేసిందంటే

రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఏమవుతుందో తెలుసా ??