బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా

Updated on: Dec 17, 2025 | 5:30 PM

భారతీయ సినిమాల్లో హింస పెరిగిపోతుంది. దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకుల ఆదరణ చూసి వయోలెన్స్ కథల వైపు మొగ్గు చూపుతున్నారు. 'అఖండ', 'యానిమల్', 'సలార్' వంటి చిత్రాల్లో రక్తపాతం, హింస మితిమీరినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. హింసే సక్సెస్ మంత్రంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

చంపేయ్.. నరికేయ్.. రక్తం ఏరులై పారాల్సిందే.. ముక్కలు ముక్కలుగా పేలిపోవాల్సిందే..! ఆగండి ఆగండి.. ఏంటీ హింస.. ఎందుకింత వయోలెన్స్ అనుకుంటున్నారా..? దీనికి కారణం మేం కాదండీ బాబూ.. మన దర్శకులే. ఈ మధ్య వయోలెన్స్ ఎక్కువగా సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. అందుకే వాళ్ల అడుగులు అటువైపే వెళ్తున్నాయి. మన సినిమాలకి ఈ పాట పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందిప్పుడు. నిజంగానే వయోలెన్స్‌ను ప్యాషన్‌లా.. ఫ్యాషన్‌లా ఫీల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా దర్శకులు కూడా హింస ఎక్కువగా కథల వైపే అడుగులేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చినా ఓకే గానీ వయోలెన్స్‌లో మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఈ మధ్య అలాంటి సినిమాలే కాసులు కురిపిస్తున్నాయి కూడా. కొన్నేళ్లుగా మితిమీరిన హింస మన సినిమాల్లో కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. బోయపాటి అఖండ, స్కంద లాంటి సినిమాల్లో రక్తం ఏరులై పారింది. ఇక సందీప్ వంగా యానిమల్ గురించి ఏం చెప్పాలి..? ఇంటర్వెల్ సీక్వెన్స్ లోనే వందల మందిని చంపేస్తాడు హీరో. సలార్‌లోనూ వయోలెన్స్ మామూలుగా ఉండదు. పైగా ప్రభాస్ కటౌట్‌కు ఎంతమందిని చంపినా ఆడియన్స్ చూస్తున్నారు. ఈ మధ్యే హిందీలో వచ్చిన కిల్ సినిమాలో హీరోకు చంపడమే పని.. కథ కూడా అలాగే ఉంటుందనుకోండి..! ప్రస్తుతం బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న ధురంధర్‌లోనూ రక్తపాతం ఏరులై పారింది. కొన్ని సీన్స్ అయితే కనీసం చూడలేని విధంగా ఉన్నాయి. మలయాళంలో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో ఇండియన్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ సినిమా. నాని హిట్ 3 మోతాదుకు మించి హింస ఉంటుంది. వీటితో పాటు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ సినిమా.. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓవర్ వయోలెన్స్‌తోనే రానున్నాయి. తాజాగా ధురంధర్ చూస్తుంటేనే భయమేస్తుంది.. వీటిని ఏజ్ రిస్ట్రిక్టిడ్ కంటెంట్ అంటూ యూ ట్యూబ్ కూడా అడ్డు కట్టేస్తుందంటే.. ఆ వయోలెన్స్ రేంజ్ అర్థమైపోతుంది. మొత్తానికి రాను రాను హింసే సక్సెస్ మంత్రలా మారిపోతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీనియర్ హీరోలకు ఆప్షన్ లేదు.. ఇంకా వారే దిక్కు

నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్న కుర్ర హీరోలు..

2 వారాలు.. 12 సినిమాలు.. దండయాత్రే

బిగ్‌బాస్ టైటిల్ నాదే నాన్నా.. భరణికి లీకిచ్చిన తనూజ..

ఫైనల్ ఓటింగ్.. ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కళ్యాణ్‌