Vijays: చాలా కాలంగా ఇబ్బందుల్లో విజయ్ మూవీస్

Updated on: Jan 10, 2026 | 3:09 PM

జన నాయగన్ సినిమా సెన్సార్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. అయితే, విజయ్ నటించిన పలు చిత్రాలకు గతంలోనూ ఇలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి. సర్కార్ నుంచి తలపా వరకు, సెన్సార్ సమస్యలు, రాజకీయ వివాదాలు, నిర్మాణ సంస్థపై ఆరోపణలు వంటి అనేక కారణాలతో విజయ్ సినిమాలు తరచుగా ఇబ్బందుల్లో పడుతున్నాయి.

సంక్రాంతి బరిలో విడుదల కావాల్సిన విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. అయితే, ఇలాంటి ఇబ్బందులు విజయ్ సినిమాలకు కొత్తేమీ కావు. గతంలోనూ ఆయన నటించిన పలు చిత్రాలు వివిధ కారణాలతో వివాదాల్లో చిక్కుకున్నాయి. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ సినిమా కూడా చివరి నిమిషం వరకు విడుదల అవుతుందా లేదా అనే ఉత్కంఠను అభిమానులకు కలిగించింది. విడుదల తర్వాత కూడా కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చింది. అలాగే మెర్సల్ చిత్రం షూటింగ్ సమయంలో జంతువులను ఇబ్బంది పెట్టారంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రిలీజ్ అనంతరం జీఎస్టీ, డిజిటల్ ఇండియాకు సంబంధించిన డైలాగులు రాజకీయ దుమారం రేపాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Drishyam 3: దృశ్యం 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన జీతూ జోసెఫ్‌

Anil Kapoor: నాయక్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ కపూర్

Priyanka Chopra: నేషనల్‌, గ్లోబల్ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా

Jana Nayagan: ఓడి గెలిచిన హీరో.. ఎట్టకేలకు జననాయగన్‌కు లైన్ క్లియర్

Netflix: నెట్‌ ఫ్లిక్స్‌ సైట్ క్రాష్‌.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ