సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
విజయ్ దళపతి చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా పడింది. సెన్సార్ బోర్డుతో వివాదం కారణంగా సంక్రాంతి సీజన్లో సినిమా రిలీజ్ కాలేదు. నిర్మాత వెంకట్ నారాయణన్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ, తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. UA 16+ సర్టిఫికేట్ ఆశించినప్పటికీ అది లభించలేదని, ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉందని తెలిపారు.
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన సినిమా జన నాయగన్. ఈ సినిమా తర్వాత తాను ఇక సినిమాల్లో నటించంటూ అనౌన్స్ చేశాడు విజయ్ దళపతి. దీంతో ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది అందర్లో…! ఈ సినిమాను చూడాలనే ఉత్సాహంతో.. భారీగా బుకింగ్స్ కూడా జరిగాయి. కానీ కట్ చేస్తే.. సెన్సార్ బోర్డ్‌తో.. వివాదం కారణంగా జననాయగన్ మూవీ రిలీజ్ ఆగిపోయింది. వరుస పరిణామాల కారణంగా.. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రొడ్యూసర్ CBSCతో ఉన్న వివాదంపై రియాక్టయ్యాడు. తన నిస్సహాయతను తెలియజేశాడు. తాజాగా ఈ మూవీ నిర్మాత వెంకట్ నారాయణన్ జన నాయగన్ వాయిదా పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. KVN ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా వివిధ కాల్స్ సందేశాలు వస్తున్నాయి. అభిమానులు సినిమాపై కలిగి ఉన్న ప్రేమను అవి చూపిస్తున్నాయి.. ప్రస్తుతం, ఈ విషయం కోర్టులో ఉన్నందున, కొన్ని విషయాలను పూర్తిగా వెల్లడించలేము. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18, 2025న సెన్సార్ బోర్డుకు సమర్పించారు.డిసెంబర్ 22న కొన్ని మార్పులు చేయాలని మాకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత, UA 16+ సర్టిఫికేట్ వస్తుందని మాకు మెయిల్ రావడంతో.. సెన్సార్ బోర్డు సూచించిన అన్ని మార్పులను చేసి, సినిమాను తిరిగి సమర్పించాము. అయితే, సర్టిఫికేట్ ఆశించిన విధంగా రాలేదు. అందుకే మా వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. అంటూ చెప్పుకొచ్చారు ఆయన.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన
సంక్రాంతినాడు వీటిని దానం చేస్తే.. శనిదేవుడి ప్రసన్నంతో వందరెట్ల పుణ్యఫలం
వచ్చే నెలలో మరో DSC నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా ??
