నేను ముందే చెప్పా కదా.. అల్లు అర్జున్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు బన్నీ అరెస్ట్ ను ఖండించారు. ఈ కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైనా ఒక రాత్రంతా చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది.
మరుసటి రోజు ఉదయం కానీ రిలీజ్ కాలేదు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడిదే విషయంపై వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి స్పందించారు. అల్లు అర్జున్ కు కుటుంబ సభ్యులు దిష్టి తీస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. చెప్పానా? ముందే చెప్పానా? గుమ్మడి కాయలతో దిష్టి తీయించుకోమని… ఇప్పుడు దిష్టి తీస్తున్నారు. పోన్లెండి.. అంటూ వీడియోలో చెప్పారు. తన మాటను ఆ మాత్రమైనా గౌరవించారన్నారు. ఇక దిష్టంతా పోయింది లెండి. నెక్ట్స్ చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి.. ఆల్ ది బెస్ట్ అంటూ.. తను ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోను ముగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: